వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అంటూ RGV పోస్ట్..!

-

గత కొన్ని రోజులుగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చర్చల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన పై కేసు నమోదు అయిన తర్వాత కనిపించకుండా పోయిన RGV తాజాగా సోషల్ మీడియాలో ఓ పెద్ద పోస్ట్ చేసారు. అందులో.. నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ .. ఎందుకంటే ఈ టైమ్ అంత నేను నా డెన్ ఆఫీసు లోనే ఉన్నాను, అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకి వెళ్ళడం తప్ప.

ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంత వరకు నా ఆఫీసు లోకి కాలే పెట్టలేదు.. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియా తో కానీ చెప్పలేదు. ఒక వేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసు లోకి ఎందుకు రారు అంటూ RGV ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news