తెలంగాణలో చిల్లర ప్రభుత్వం నడుస్తోంది : మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

-

బీఆర్ఎస్ దీక్షా దీవస్ లో పాల్గొన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ నికార్సయిన పార్టీ. కానీ సీఎం రేవంత్ పై ప్రజలు తిరగబడుతున్నారు. ఏడాది పాలనలోనే ప్రజలు తిట్ల పురాణం అందుకున్నారు. రేవంత్ రెడ్డి కి మూడింది. ప్రస్తుతం తెలంగాణలో చిల్లర ప్రభుత్వం నడుస్తోంది. దీక్షా దీవస్ రోజు మీడియా డైవర్షన్ కోసమే మంత్రులు పర్యటనలు పెట్టుకున్నారు అని ఆయన అన్నారు.

ఇక తెలంగాణ ప్రజల కోసం నాడు కేసీఆర్ దీక్ష చేసారు. కేసీఆర్ దీక్షా దివస్ తోనే నాడు కేంద్రంలో కదలిక వచ్చింది. నాడు తెలంగాణ కాంగ్రెస్ చేతిలో బందీ అయింది. నేడు రేవంత్ చేతిలో బందీ అయ్యింది. 11 నెలల్లో తెలంగాణ ను అస్తవ్యస్తం చేశారు. 2027 లో జమిలీ ఎన్నికలు ఉన్నాయి. అప్పుడు మళ్లీ అధికారం బీఆర్ఎస్ దే. గతంలో జరిగిన తప్పులు పొరపాట్లు సవరించుకుంటాం. పోలీసు కేసులకు భయపడం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతల కండ్లు నెత్తికెక్కాయి అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news