ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇవాల్టి నుంచి పెన్షన్ల పంపిణీ.. ఒకరోజు ముందుగానే ! 

-

 

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం అవుతోంది. అంటే ఆ రోజున అందరికీ హాలిడే. అందుకే శనివారం రోజున అంటే నవంబర్ 30వ తేదీన ఇవాళ… పెన్షన్ ప్రక్రియ ప్రారంభించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఇవాల్టి నుంచి పెన్షన్ పంపిణీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించబోతుంది చంద్రబాబు ప్రభుత్వం.

We are going to give Rs.1.64 lakh crore pensions said CM Chandrababu

ఇక అనంతపురంలోని నిమ్మ కళ్ళు లో చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తారు. ఉదయం 11:40 గంటలకు గన్నవరం నుంచి బెంగళూరు విమానాశ్రయం చేరుతారు చంద్రబాబు నాయుడు. ఇక 12 గంటల 45 నిమిషాలకు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో నెమకల్లు చేరుకుంటారు చంద్రబాబు నాయుడు. ఇక ఆ గ్రామంలో పెన్షన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఆ గ్రామంలో ఉన్న ఇందిరమ్మ కాలనీలో… పెన్షన్ ప్రక్రియ ప్రారంభిస్తారు నారా చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news