తెలంగాణ వాహనదారులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే పెట్రోల్ అలాగే డీజిల్ వాహనాలకు లైఫ్ టాక్స్ పెంచాలని నిర్ణయం తీసుకోబోతుందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ మేరకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తమిళనాడు కర్ణాటక కేరళ… ఈ రాష్ట్రాలలో పెట్రోల్ అలాగే డీజిల్ వాహనాలపై విధించే లైఫ్ టాక్స్.. విపరీతంగా ఉందట.
అయితే ఆ మూడు రాష్ట్రాలతో తెలంగాణను పోల్చితే మన తెలంగాణ రాష్ట్రంలో టాక్స్లు చాలా తక్కువగా ఉన్నట్లు… లెక్కలు చెబుతున్నాయని సమాచారం. అయితే ఆదాయం పెంచుకునేందుకు… తెలంగాణ రాష్ట్రంలో కూడా త్వరలోనే పెట్రోల్ అలాగే డీజిల్ వాహనాలకు లైఫ్ టాక్స్ పెంచాలని డిసైడ్ అయ్యారట. దీనిపై త్వరలోనే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతుందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒకవేళ ఇదే నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదనంగా 2000 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని చెబుతున్నారు అధికారులు.