తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం

-

తిరుమల వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్‌. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారట. ఇటీవలే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నేటి నుంచి అమలు చేయనుందని టీటీడీ అధికారులు అంటున్నారు.

Ban on political speeches in Tirumala

రాజకీయ విమర్శలు చేసే వ్యక్తులు ఈ విషయాన్ని దృష్టి పెట్టుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసిందట. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిందట. ఇక అటు తిరుమల భక్తులకు బిగ్‌ అలర్ట్‌. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62, 147 మంది భక్తులు కాగా..23, 096 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news