తెలంగాణలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ భారీ ఎన్ కౌంటర్ లో 7 గురు నక్సలైట్లు మృతి చెందారు. ఈ సంఘటన కాసేపటి క్రితమే జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చత్తీస్ ఘడ్, తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో ఏడుగురు నక్సలైట్లు మృతి చెందారు. ఏటూర్ నాగారం అడవుల్లో మావోయిస్టులకు అలాగే, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఇక ఎదురు కాల్పులలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. అయితే… ఈ ఎన్ కౌంటర్ ను ఇంకా ములుగు జిల్లా పోలీసులు ధృవీకరించలేదు. ఏటూరు నాగారం మండలంలోని చల్పాకా అడవి ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగిందట. ఇటీవల వాజేడులో ఇద్దరు వ్యక్తులను పోలీస్ ఇన్ ఫార్మర్ ల నేపంతో చంపారు మావోయిస్టులు. నాటి నుంచి మావోయిస్టుల కోసం అభయారణ్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు…ఇవాళ 7 గురిని ఎన్‌కౌంటర్ చేశారట. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.