మడకశిర విద్యార్థి హత్య కేసును చేధించిన పోలీసులు..అక్కతో అక్రమ సంబంధమే కారణం !

-

మడకశిరలో విద్యార్థి చేతన్ హత్య కేసును 48 గంటల్లో చేధించారు ఏపీ పోలీసులు. ఈ తరుణంలోనే… హత్య కేసు వివరాలు వెల్లడించారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న. బాలుడు హత్య కేసులో ప్రధాన నిందితులు అశోక్, నాగలక్ష్మిలు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రత్న మాట్లాడుతూ… నిందితుడు అశోక్ కు వావి వరుసలు లేవన్నారు. బాలుడు చేతన్ తల్లి..అశోక్‌ కు వరసకు అక్క అవుతుందని తెలిపారు. అక్క పుష్పలతను గత కొన్ని రోజులుగా సోదరుడు అశోక్ లైంగికంగా వేధిస్తున్నాడని ఎస్పీ వివరించారు.

మడకశిర విద్యార్థి హత్య కేసులో నమ్మలేని నిజాలు ముద్దాయి నుంచి సేకరించామన్నారు. విద్యార్థి చేతన్ తల్లి పుష్పలత తనతో అక్రమ సంబంధానికి ఒప్పుకోలేదని…వేరే మహిళతో విద్యార్థి చైతన్ ను అశోక్‌ హత్య చేశాడన్నారు. అశోక్ తో పాటు హత్యకు సహకరించిన నాగలక్ష్మిను అరెస్టు చేసామని ప్రకటించారు. కొన్ని గంటల ముందు పోలీసులకు సమాచారం అందివుంటే విద్యార్థిని కాపాడే వాళ్ళమన్నారు. స్కూల్ నుంచి విద్యార్థి చేతన్ కిడ్నాప్ అయిన వెంటనే ప్రధానోపాధ్యాయుడికి విషయం తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు… సకాలంలో స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయడం జరిగిందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news