దివ్యాంగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే పెన్షన్లు పెంచుతాం : మంత్రి సీతక్క

-

రాష్ట్రంలో ఉన్న 10లక్షల మంది దివ్యాంగుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. త్వరలోనే దివ్యాంగుల పెన్షన్లు పెంచుతామన్నారు. వారి స్వయం ఉపాధి కోసం స్కూటర్లు ఇస్తామని చెప్పారు. దివ్యాంగులు తమ లోపాలను చూసి బాధ పడొద్దని, మీ ప్రతిభ చూస్తే మీరు సకలాంగులకు తక్కువేమి కాదన్నారు. చిన్న లోపాన్ని చూసుకొని మానసికంగా కుంగిపోవద్దని ఆత్మ న్యూనత అవసరం లేదన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీతక్క హాజరై మాట్లాడారు.

తెలంగాణ ప్రజా ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం, ఉపాధి కోసం నిధులు వెచ్చిస్తున్నామని, దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.50కోట్లు కేటాయించిందని ప్రత్యేకంగా జాబ్ పోర్టర్ ను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇస్తున్నామని గుర్తు చేసారు. వికలాంగుల పింఛన్ ను కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా పెంచడం లేదని, యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లనే మోడీ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news