పేరు మార్చుకున్న మహారాష్ట్ర నూతన సీఎం..!

-

మహారాష్ట్ర సీఎం ఎవరు అనే దానిపై సస్పెన్స్ వీడింది. ఫైనల్ గా సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలోని ఆజాద్ మైదాన్ లో సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉంటే.. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఇన్విటేషన్ లెటర్ సర్ ప్రైజ్ గా మారింది. మహారాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సుజాత సౌనిక్ జారీ చేసిన ఈ లెటర్ లో ఫడ్నవీస్ పేరు దేవేంద్ర సరితా గంగాధరరావు ఫడ్నవీస్ అని ఉంది.

ఫడ్నవీస్ తల్లి పేరు సరిత కాగా.. తండ్రి పేరు గంగాధర్. సాధారణంగా మహారాష్ట్ర ప్రజలు తండ్రి పేరును మిడిల్ నేమ్ గా వాడుతారు. ఈసారి ఫడ్నవీస్ తల్లి పేరును కూడా తన పేరుకు జోడించారు. తల్లి పేరును వాడటం ఇదే మొదటి సారి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాఖలు చేసిన అఫిడవిట్ లో తన పేరును దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్ గా పేర్కొన్నారు. 2014, 2019 ప్రమాణ స్వీకారోత్సవాల సమయంలో కూడా తన తల్లి పేరును తీసుకురాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news