వారికి గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్ల పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

-

ఇందిరమ్మ ఇండ్ల పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఈ మేరకు బుధవారం ఓ కీలక ప్రకటన విడుదల చేసారు. తెలంగాణలో నిరుపేదల ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల సాకారం కానుంది. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు లబ్దిదారుల ఎంపిక ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఇండ్ల పథకం అమలుకు ఉన్న అవరోధాలను అధిగమిస్తూ అమలుకు అవసరమైన కార్యచరణను వేగవంతం చేసిందని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి డిసెంబర్ 06 నుంచి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఒక్కో ఇంటికి రూ.5లక్షలు ఆర్థిక సాయం అందజేస్తామని.. ఇవి 4 దశల్లో నేరుగా లబ్దిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. నాలుగేళ్లలో 20లక్షల ఇండ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. మొదటి విడుతలో నివాస స్థలం ఉన్న వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. వారిలో ముఖ్యంగా దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్టు తెలిపారు మంత్రి పొంగులేటి.

Read more RELATED
Recommended to you

Latest news