పుష్ప-2 మూవీ చూసేందుకు సంధ్య థియేటర్‌కు వెళ్లిన ఓ ఫ్యామిలీలోని మహిళ అక్కడ జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ క్రమంలోనే మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు సంధ్య థియేటర్ల యాజమాన్యంపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు.
థియేటర్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కారణంగానే అక్కడ తొక్కిసలాట జరిగి తన భార్య ప్రాణాలు కోల్పోయిందని బాధిత భర్త ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఈ మేరకు కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పుష్ప -2 సినిమాకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ రావడంతో వారిని కంట్రోల్ చేసేందుకు థియేటర్ యాజమాన్యం చర్యలు తీసుకోలేదని పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.