చంద్రబాబుకు షాక్‌…మద్యం కొనుగోళ్లు ఆపేస్తామంటూ వైన్స్‌ అసోషియేషన్‌ హెచ్చరిక !

-

ఏపీ సీఎం చంద్రబాబుకు షాక్‌ తగిలింది. మద్యం కొనుగోళ్లు ఆపేస్తామంటూ వైన్స్‌ అసోషియేషన్‌ హెచ్చరికలు జారీ చేసింది. మద్యం కమిషన్ పెంచకపోతే లైసెన్స్ ఫీజు కట్టలేమని ఏపీలో మద్యం షాపుల యూనియన్ ప్రకటన చేసింది. మద్యం షాపుల టెండర్ కు ముందు ప్రభుత్వం ప్రకటించిన 20 శాతం కమిషన్ ఇస్తే తప్ప షాపులు నడపలేమని అంటున్నారు. రెండు నెలలకు కట్టాల్సిన ఫీజులు ముందుగానే కట్టించుకుంటున్నారు.

Wines Association warning to stop buying liquor

మద్యం షాపులకు ఇస్తున్న కమిషన్ ను పెంచాలంటూ మద్యం షాపులు, బార్ షాపుల యజమానులు… ఎక్సైజ్ కమిషనర్ కు వినతి పత్రం అందించారు. టెండర్ సమయంలో ప్రభుత్వం ఇస్తామన్న కమిషన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 9.5% శాతం మార్చాలని కోరారు మద్యం షాప్ యజమానులు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కు నోటీస్ ఇచ్చింది మద్యం షాపుల యూనియన్. సరైన నిర్ణయం తీసుకోక పోతే మద్యం కొనుగోళ్లు ఆపేస్తామని హెచ్చరించారు. జనవరిలో కట్టాల్సిన లైసెన్సు ఫీజులు కూడా చెల్లించలేమని తేల్చి చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news