కర్నూలు పుట్టగొడుగుల ఫ్యాక్టరీలో కార్మికులకు తీవ్ర అస్వస్థత నెలకొంది. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు….ఓర్వకల్ మండలం కాల్వబుగ్గ వద్ద పుట్టగొడుగుల ఫ్యాక్టరీ లో కార్మికులకు తీవ్ర అస్వస్థత నెలకొంది. ఫ్యాక్టరీ డ్రైనేజీ శుభ్రం చేస్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు నలుగురు కార్మికులు. ఫ్యాక్టరీ వ్యర్థాలతో నిండిపోయిన 5 అడుగుల లోతు ఉంది డ్రైనేజీ.

అయితే.. ఆ డ్రైనేజీ బ్లాక్ కావడం తో శుభ్రం చేయిస్తోంది పుట్టగొడుగుల ఫ్యాక్టరీ యాజమాన్యం. యంత్రాలతో కాకుండా కార్మికులతో శుభ్రం చేయించడంతో భరించలేని దుర్గంధానికి అపస్మారక స్థితిలోకి వెళ్లారు కార్మికులు. ఈ నేపథ్యంలోనే…ఫ్యాక్టరీ డ్రై నేజీ శుభ్రం చేస్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు నలుగురు కార్మికులు. ఇక వారిని కర్నూలు జిజిహెచ్ కు తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.