తప్పు చేసినా, అప్పు చేసినా కేసీఆర్ పాలనే బాగుంది : సామాన్య మహిళ

-

ఏడాది కాంగ్రెస్ పాలనలో చెప్పిన వాటి కంటే చాలా చేశామని ఆ పార్టీ, ప్రభుత్వం ఓ వైపు ఉత్సవాలు నిర్వహిస్తుంటే మరోవైపు సీఎం రేవంత్ పాలనపై సామాన్యులు, రైతులు పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ పాలన కంటే బీఆర్ఎస్ పాలనే నయ్యమని అంటున్నారు. తాజాగా ఓ మహిళ ఓ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘తప్పు చేసినా, అప్పు చేసినా కేసీఆర్ పాలనే బాగుంది. కాంగ్రెస్ వచ్చినంక ఏం లేదు.

రైతుబంధు ఇస్తా అంటే ఎవరైనా వద్దంటారా? అసలు బోనస్ అనేదే లేదు? రోజు కూలి చేసుకునేటోళ్లం బస్సులో ఎందుకు తిరుగుతం?ఎప్పుడో ఒకసారి సందర్భం వచ్చి బస్సులో వెళ్తే మహిళలకు విలువ లేదు. మగవాళ్లు డబ్బులు ఇచ్చి ప్రయాణిస్తున్నారంటూ ఆడవాళ్లను నిల్చోబెడుతున్నారు.ఏడాదిలో కాంగ్రెస్ పాలన ఏం మంచిగలేదు. ఫ్రీ బస్సు వల్ల ఎవరికి లాభం అని’ సామాన్య మహిళ ప్రశ్నించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news