కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొలువుదీరి ఏడాది పూర్తయిన సందర్భంగా బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ హ్యాష్ ట్యాగ్‌తో కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
‘కాంగ్రెస్ అంటే కమిటీలు, కమీషన్లు, కాలయాపనలు, ధరణిపై కమిటీ, హైడ్రా, మూసీ, ఫోర్త్ సిటీలతో కమీషన్లు, రైతు భరోసాపై కాలయాపన, అలాంటి కాంగ్రెస్ పాలనలో ఒక్క ఏడాదిలో కాదు.. ఒక యుగం గడిచినా సంక్షేమం, అభివృద్ధి దిశగా అడుగు పడదు, సావులు, కన్నీళ్ళే కాంగ్రెస్ కలకాలం నడిచే మార్గం’ అంటూ పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ చేసిన ఈ ట్వీట్‌ను కొందరు రీట్వీట్ చేస్తున్నారు.