బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావును బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏ క్షణమైనా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం అందడం, కౌశిక్ రెడ్డి ఇంటి ఎదుట పెద్దఎత్తున పోలీసులు మోహరించి ఉండటంతో ఆయన్ను కలిసేందుకు మాజీ మంత్రి తన అనుచరులతో కలిసి బయలుదేరారు.
తీరా అక్కడకు చేరుకోగానే పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, హరీశ్ రావుతో పాటు ఆయన అనుచరులు కొందరిని పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో మాజీ మంత్రిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు పీఎస్ ఎదుట బైఠాయించారు. స్టేషన్ ముందు నిరసన తెలుపుతున్న BRS కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో తరలిస్తున్నారు.