సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట..రంగంలోకి నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్

-

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్బంగా బుధవారం రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు ప్రస్తుతం చావుబతుకుల మధ్య కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు 105, 118 (1) రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ చట్టం కింద సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పైన, ఆయన సెక్యూరిటీ టీమ్ పైనా కేసులు నమోదు చేశారు.

తాజాగా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందడంతో దానిని విచారణకు స్వీకరించింది.న్యాయవాది రామారావు ఇమ్మినేని, కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ కమిషన్‌ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై విచారణ జరిపేందుకు నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్ ముందుకొచ్చింది. దీంతో ఈ కేసులో మరో మలుపు తిరగనుంది. దీనిపై కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news