తెలంగాణ సెక్రేటేరియట్ ఆవరణలో ఈనెల 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. దీనికి రావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఆహ్వానిస్తున్నట్లు బీసీ సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా ఆహ్వాన పత్రికలు తానే అందిస్తానని మంత్రి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్రమంత్రులను తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆహ్వానించేందుకు టైం ఇవ్వాలని వారి వ్యక్తిగత సిబ్బందికి సమాచారం అందించామన్నారు. వారిచ్చి టైం మేరకు వెళ్లి ఆహ్వాన పత్రికలు అందిస్తానని పొన్నం తెలిపారు. మంత్రి పొన్నం ప్రకటనతో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్, కేంద్రమంత్రులు హాజరవుతారో లేదో తెలియాలంటే వేచిచూడాల్సిందే.