కాంగ్రెస్‌ నిర్బంధిస్తున్నది బీఆర్‌ఎస్‌ నేతలను కాదు.. అంబేద్కర్‌ని: కేటీఆర్‌

-

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్వేచ్ఛను హరిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతుంటే.. అడ్డుకుంటున్నారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున కేసీఆర్ ఏర్పాటు చేసారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించుకున్నామని చెప్పారు. తమ మీద అక్కసుతో బాబా సాహెబ్ అంబేద్కర్ వర్థంతి రోజు కనీసం గేట్లు కూడా తెరవకుండా ఆ మహానీయుడిని నిర్భంధించి అవమానిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.

సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టి గౌరవించుకున్నామని చెప్పారు. తమమీద అక్కసుతో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి నాడు కనీసం గేట్లు కూడా తెరవకుండా ఆ మహానీయున్ని నిర్భంధించి, అవమానిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్‌ నిర్బంధిస్తున్నది బీఆర్‌ఎస్‌ నేతలను కాదని, అంబేద్కర్‌నని చెప్పారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం వెనుక మీ ఉద్దేశమేంటని ప్రశ్నించారు. దళితబంధు తొలగించి అంబేద్కర్‌ అభయహస్తం తెస్తామన్నారని, ఇప్పటి వరకు దాని అమలు ఊసేలేదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news