ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులు అలాగే ఉద్యోగులకు బిగ్ అలర్ట్. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించిన సెలవులను ప్రకటన.. చేయడం జరిగింది. 2025 సంవత్సరానికి సంబంధించిన సాధారణ అలాగే ఆప్షనల్ సెలవుల జాబితాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది.
ఇక చంద్రబాబు నాయుడు సర్కార్ లెక్క ప్రకారం 2025 సంవత్సరంలో 23 సాధారణ అలాగే 19 ఆప్షనల్ సెలవులు ఉండబోతున్నాయి. అంటే దాదాపు 42 రోజులపాటు హాలిడే అన్నమాట. 23 సాధారణ సెలవులలో రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామ నవమి, మోహరం… ఆది వారం రావడంతో 19 సెలవులు మాత్రమే ఉద్యోగులకు లభించబోతున్నాయని అధికారులు ప్రకటించారు. ఇక ఆప్షనల్ హాలిడేస్ లో ఈద్ ఏ గదిర్, మహాలయ అమావాస్య ఆదివారం వచ్చాయి. మొత్తం 12 నెలల్లో మే అలాగే నవంబర్ తప్ప పది నెలల్లో సెలవులు ఉన్నాయని అధికారులు ప్రకటించారు.