నేడు నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన…షెడ్యూల్‌ ఇదే !

-

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన ఖరారు అయింది. నేడు నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గం.కు బేగంపేట నుంచి చాపర్ ద్వారా నార్కట్ పల్లి (మం) బ్రాహ్మణ వెల్లెంలకు చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇవాళ మధ్యాహ్నం 2.40 కి ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైలాన్, డెలివరి ఛానెల్‌ ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

cm revanth reddy
CM Revanth Reddy’s visit to Nalgonda district today

ఇక ఇవాళ మధ్యాహ్నం 3.15 ని.కు మిర్యాలగూడ నియోజకవర్గం లోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 800 MW యూనిట్-2 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇవాళ సాయంత్రం 4.30 ని.కు నల్లగొండ మెడికల్ కాలేజీ భవన్నాన్ని ప్రారంభించనున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…ఆ తర్వాత హైదరాబాద్‌ కు వచ్చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news