రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంత్రి కొండ సురేఖ కొత్త వివాదానికి తెరలేపారు. వేములవాడ రాజన్న కోడెల పంపిణీలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దీంతో రాజన్న కోడేలు పక్క దారి పట్టింది. దీంతో మరో వివాదంలో మంత్రి కొండ సురేఖ చిక్కుకున్నారు. మంత్రి కొండా సురేఖ సిఫారసుతో ఆగస్టు 12న 49 కోడేలు సురేఖ అనుచరుడు రాంబాబు అనే వ్యక్తికి అప్పగించారట. మంత్రి కొండా సురేఖ మెప్పుకోసం నిబంధనలు విరుద్ధంగా కోడేలను అప్పగించాడు ఆలయ ఈవో.
రైతులకు రెండు నుంచి మూడు కోడేలు అప్పగించి, మంత్రి లెటర్ ను విచారించకుండానే ఏకంగా 49 కోడలు ఇచ్చాడట ఆలయ వినోద్ రెడ్డి. అయితే… విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకుల ఫిర్యాదుతో ఈ అక్రమాలు వెలుగు చూశాయి. 49 కోడెలు విక్రయించినట్లుగా పోలీసులకు వెల్లడించాడట రాంబాబు.
మంత్రి సురేఖ అనుచరుడు రాంబాబు పై వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. పశువుల వ్యాపారిగా ఉన్న మంత్రి అనుచరుడికి రాజన్న కోడేలు అప్పగింతపై రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి పై మండిపడుతున్నారు రాజన్న భక్తులు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి కేటాయింపు పై విచారణ జరపాలంటున్నారు విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు, భక్తులు.