భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 16వ తేదీన తెలంగాణ కు చేరుకుంటారు. శీతకాల విడిది కోసం ముర్ము 21వ తేదీ వరకు హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి భవన్ లో బస చేస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17న ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. గుంటూరులోని మంగళగిరి ఎయిమ్స్ వైద్య కళాశాల స్నాతకోత్సవానికి ముర్ము హాజరు కానున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎయిమ్స్ సంబంధిత వైద్యాధికారులతో పాటు నగర పాలక, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఏర్పాట్ల పై పలు సూచనలు చేశారు. రాష్ట్రపతి పాల్గొనే సదస్సు ప్రధాన ఆడిటోరియాన్ని పరిశీలించి కార్యక్రమంలో పాల్గొనే వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రపతి మంగళగిరికి చేరుకొని ఎయిమ్స్ లోకి వచ్చే మార్గం, తిరిగి వెళ్లే మార్గంలో అధికారికంగా చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లను సంబంధిత అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించాలని ఆదేశించారు. అధికారులు, ప్రముఖుల వాహన పార్కింగ్ ఏర్పాట్ల పై సూచనలు చేశారు.