పోలీసుల తీరుపై శాంతి యుతంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నాం అని అంబటి రాంబాబు తెలిపారు. ఎస్పీ కార్యాలయం లేదా డీజీపీ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతాం. అయితే నేను డేట్ చెప్పను.. ఎందుకంటే హౌస్ అరెస్టు లు చేస్తారు. నేరుగా వెళ్లి నిరసన తెలుపుతా. నేను తెలిపే నిరసన నా ఆవేదన అని అంబటి అన్నారు. ఇక పోలీసుల వద్ద టీడీపీకి ఓ చట్టం.. వైసీపీకి ఓ చట్టం ఉందా అని ప్రశ్నించిన ఆయన.. మేము ఇచ్చిన ఫిర్యాదు పై చర్యలు తీసుకునే వరకు పోరాడతాం అన్నారు.
ఇక లోకేష్ అండ తో సృష్టించబడిన రోబోలు కొంత మంది చీమ రాజా పేరు తో నాపై ట్రోల్లింగ్స్ పెడుతున్నారు. నేను ట్రోలింగ్స్ కు భయపడే వ్యక్తి నీ కాదు. ప్రతి ట్రోలింగ్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పోలీస్ లు ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలి. మేము పెట్టిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలి. నాకు గన్ మెన్ లు ఉన్నా లేకున్నా భయపడే వ్యక్తి నీ కాదు. ఒకప్పుడు నాకు పది మంది గన్ మెన్ లు ఉన్నారు. ఇప్పుడు ఒక్క గన్ మెన్ కూడా లేరు. అయినా నేను భయపడను అని అంబటి పేర్కొన్నారు.