ఆహారం: బరువు తగ్గాలనుకుంటే ఖాళీ కడుపుతో వీటిని తినాల్సిందే

-

ఉదయం లేచిన తర్వాత మొట్టమొదటగా తినే ఆహారం ఆరోగ్యవంతంగా ఉంటే శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది. ముఖ్యంగా శరీర బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడేవారు తాము ఖాళీ కడుపుతో తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏది పడితే అది తీసుకోవడం వల్ల అనవసరంగా ఇంకా బరువు పెరిగే అవకాశం ఉంది.

శరీర బరువును తగ్గించాలన్న ఆలోచన మీకు ఉంటే ఖాళీ కడుపుతో తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటో తెలుసుకోండి.

ఉసిరి:

విటమిన్ సి పుష్కలంగా లభించే ఉసిరి.. శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పొద్దున్న లేవగానే ఖాళీ కడుపుతో ఉసిరి కాయలతో జ్యూస్ చేసుకుని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడటమే కాకుండా శరీర కొవ్వు కరిగిపోయే అవకాశం కూడా ఉంది. అంతేకాదు, ఉసిరిలోని పోషకాలు చర్మానికి మెరిసే గుణాన్ని అందిస్తాయి.

చియా విత్తనాలు:

చియా విత్తనాల్లో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలతో పాటు ప్రోటీన్ ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ చియా విత్తనాలను గ్లాసు నీళ్లలో నానబెట్టి పొద్దున్న లేచిన తర్వాత ఆ నీళ్లను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీని కారణంగా మీకు త్వరగా ఆకలి వేయదు. అందువల్ల ఎక్కువ తినకుండా ఉంటారు. ఎక్కువ తినకపోతే శరీరం బరువు పెరగదు.

బాదం గింజలు:

రాత్రిపూట నానబెట్టిన గుప్పెడు బాదం గింజలను తెల్లారి లేచిన తర్వాత పొట్టు తీసేసి తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇందులో ఉండే ప్రోటీన్, మంచి కొవ్వు కారణంగా ఆకలి తొందరగా వేయదు. బాదం మాత్రమే కాదు వాల్ నట్స్ తినడం వల్ల కూడా శరీర బరువు తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news