చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు థాంక్యూ : ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ

-

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు మరోసారి  థాంక్యూ చెప్పారు  ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. తాజాగా నాడు-నేడు ద్వారా స్కూళ్లలో వైసీపీ చేసిన అభివృద్ధిని చంద్రబాబు, పవన్ ప్రజలకు మరోసారి చూపించారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని.. ఈనెల 13న కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తామని చెప్పారు. కంటైనర్ షిప్ లో డ్రగ్స్ ఉన్నాయని ఆరోపించారని.. చివరికి ఏం లేదని తేల్చారని పేర్కొన్నారు. 

తుఫాన్, వర్షాల కారణంగా పంటలు దెబ్బ తిన్నాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయి వెంటనే చెల్లించాలని.. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈనెల 27వ తేదీన ఎస్ఈలకు వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు పై పరుచూరి బ్రదదర్స్ లా నాదెండ్ల మనోహర్ మాట్లాడటం సరికాదు అని.. వాస్తవాలు మాట్లాడాలి అని పేర్కొన్నారు బొత్స సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news