పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా కేసీఆర్ అమలు చేసి చూపించారని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆమె తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఆశా వర్కర్ల పై ఈరోజు జరిగిన దాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల అవమానవీయంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఒకవైపు అసెంబ్లీలో తెలంగాణ తల్లి గురించి మాట్లాడారు. మరోవైపు బయట ఆడబిడ్డలైన ఆశా వర్కర్ల మీద దాడి చేయడం దారుణం అన్నారు.
అసలు రాష్ట్రాాన్ని కాంగ్రెస్ నేతలు ఏం చేయదలుచుకున్నారని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నేతలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆశావర్కర్లపై రాక్షస మూకలా వ్యవహరించారని పేర్కొన్నారు. మహిళల చీరలను ఇష్టం వచ్చినట్టు లాగారని తెలిపారు. తెలంగాన తల్లి గురించి చెబుతూ ఆడబిడ్డలక న్యాయం చేయరా..? అని ప్రశ్నించారు సబితా ఇంద్రారెడ్డి.