సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈరోజును రాజకీయాలకు అతీతంగా పండుగల జరుపుకోవాలి అని అన్నారు. అలాగే ఎవరైనా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కించపరచాలి అని అనుకుంటే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ఇక పై ప్రతి ఏడాది డిసెంబర్ 9న ఉత్సవాలు జరపాలని నిర్ణయించాం. గత పదేళ్లలో తెలంగాణ తల్లి వివక్షకు గురైంది అని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఒక వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచించి… తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టారు. ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని మా సహచర మంత్రులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నా. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా గత పాలకులు వాహనాలకు టీజీ బదులు టీఎస్ అని నిర్ణయించారు. అలాగే గత ప్రభుత్వం జయజయహే తెలంగాణ పాటను పట్టించుకోలేదు. ఇక గత ప్రభుత్వ హయంలో గుర్తించాలని కవులను, గాయకులను గుర్తించి సన్మానిస్తాం.