జంతువుల నుంచి కూడా కొన్ని విషయాలని నేర్చుకోవచ్చు. జంతువుల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలను చూసి నేర్చుకున్నట్లయితే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లొచ్చు. అలాగే మంచిగా సక్సెస్ ని కూడా అందుకోవచ్చు. జంతువుల నుంచి ఎలాంటి విషయాలని నేర్చుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.. చీమలన్నీ కలిసి పని చేస్తాయి. చీమల ద్వారా మనం టీం వర్క్ ఎలా చేయొచ్చు అనేది నేర్చుకోవచ్చు. ఇతరుల పనిలో సహకరించడం అలాగే పని విభజన చీమల్లో స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటి లక్షణాలు మనం చీమల నుంచి నేర్చుకోవచ్చు. అలాగే సాలిగూళ్లను సాలెపురుగులు ఎంతో కష్టపడి నిర్మిస్తూ ఉంటాయి.
గూళ్ళను అల్లడంలో ఎన్నిసార్లు విఫలమైనా కూడా మళ్లీ మళ్లీ అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఓసారి విజయం సాధిస్తాయి. కాబట్టి వాటిని చూసి మనం పట్టుదల గురించి నేర్చుకోవచ్చు. ఎలా పట్టుని విడిచిపెట్టకూడదు..? ఎలా సక్సెస్ అవ్వచ్చు ఎన్నిసార్లు ఓడిపోయిన మళ్లీ ప్రయత్నం చేయాలి అనే విషయాలను వాటిని చూసి నేర్చుకోవచ్చు. అలాగే చిరుత పులి నుంచి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు వేటాడేటప్పుడు చిరుత పులులు సరైన అవకాశం వచ్చేవరకు ఎదురుచూస్తూ ఉంటాయి. అలాగే మనిషి కూడా తన జీవితంలో వచ్చే అవకాశం కోసం ఎంతో ఓపికగా ఎదురు చూడాలి.
ఇక ఎట్టి పరిస్థితుల్లో అయినా సులభంగా సర్దుకుపోవడని మనం బాతుల్ని చూసి నేర్చుకోవచ్చు. అవి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే సులభంగా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. తోడేళ్ల మందలను చూసి నాయకత్వ లక్షణాలని మనం నేర్చుకోవచ్చు. ఇది జీవితంలో ఎంతో అవసరం అలాగే మనం గుడ్లగూబల్ని చూసి వేటాడేటప్పుడు ఎంత దృష్టి పెడతాయి అనేది అర్థం చేసుకుని పని చేసేటప్పుడు మనం అంతే దృష్టిని పెడితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే శునకాలను కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు వీటిని చూసి విశ్వాసంగా ఎలా ఉండాలని మనిషి నేర్చుకోవచ్చు.