మోహన్ బాబు ఇంటివద్ద ఉద్రిక్తత.. మనోజ్ బౌన్సర్లను బయటకు పంపిస్తున్న విష్ణు

-

హైదరాబాద్ జల్ పల్లి లోని నటుడు మంచు మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాసేపటి క్రితమే మోహన్ బాబు ఇంటి నుండి మంచు మనోజ్, అతని భార్య బయటకి వెళ్ళిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. బయటకు వెళ్ళిపోతున్న క్రమంలో మంచు మనోజ్ మాట్లాడుతూ న్యాయం కోసం అందరిని కలుస్తానని ప్రకటించారు.

తాను ఆస్తి కోసమో, డబ్బుల కోసమో ఈ పోరాటం చేయడం లేదని.. ఆత్మగౌరవం కోసం, తన భార్య, పిల్లల రక్షణ కోసం చేస్తున్నానని అన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే పారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మనోజ్ వెళ్లిపోయిన కాసేపటికే అతని బౌన్సర్లను బయటకి పంపిస్తున్నారు. మౌనికతో బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడారు.

అంతలోనే విష్ణు బయటకు వచ్చి బౌన్సర్లని బయటకు తోసేశారు. దీంతో మనోజ్ బౌన్సర్లకు, విష్ణు బౌన్సర్లకి మధ్య గొడవ జరిగింది. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు అడ్డుకొని బయటకు తోసేశారు. ప్రస్తుతం మోహన్ బాబు ఫామ్ హౌస్ కి పహాడీ షరీఫ్ పోలీసులు చేరుకున్నారు. మంచు మనోజ్ దాడీ ఫుటేజ్ మాయం పై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news