చెన్నమనేని రమేష్ బాబుపై దేశద్రోహం కేసు పెట్టాలి అని కాంగ్రెస్ ప్రచార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుర్ర రవితేజ గౌడ్ అన్నారు. జర్మనీ పౌరసత్వం కలిగి ఉండి భారత చట్టాలను, వేములవాడ నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి. తప్పుడు అఫిడవిట్ లు సమర్పించి ఎన్నికల్లో పోటీ చేసిన రమేష్ బాబు పై భారత ఎన్నికల కమిషన్ అనర్హత ప్రకటించాలి.
భారత రాజ్యాంగాన్ని ధిక్కరించి ప్రజలను మోసం చేసి, ఎమ్మెల్యేగా కొనసాగిన కాలానికి సంబంధించి ఆయన పొందిన జీతం, అనుభవించిన సౌకర్యాలకు సంబంధించి ఖర్చులను వడ్డీతో సహా వసూలు చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికల్లో రమేష్ బాబు పోటీ చేయకుండా భారత ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోవాలి అని ఆయన కోరారు. అయితే నిన్న చెన్నమనేని పౌరసత్వం కేసులు ఆయనకు 30 లక్షల జరిమానా విధిస్తు తెలంగాణ హై కోర్ట్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.