పోడు సాగుకు సోలార్ పవర్ అందిస్తాం అని ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణిని కొనసాగిస్తాం. ప్రజల అవసరాలు, వారి ఇబ్బందులు నేరుగా చెప్పుకోవడానికి ప్రజా ప్రభుత్వం ప్రజావాణిని ఏర్పాటు చేసింది. ప్రజావాణి దరఖాస్తులకు పరిష్కారం దొరికిందని ప్రజలు సంతోషంగా ఉన్నారు . ప్రజలకు జవాబుదారీగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నది అని ఆయన అన్నారు.
అలాగే ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థలు ప్రజల కోసమే పని చేస్తున్నాయి. గత పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ పోడు రైతుల సమస్యలను పట్టించుకోలేదు. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు లక్ష్యాలను విస్మరించారు గత పాలకులు. ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థలు ప్రజల కోసమే పని చేస్తున్నాయి అన్న భావన ప్రజల్లో కలిగించినప్పుడే ప్రజాస్వామ్యానికి పునాదులు వేసిన వారం అవుతాం. భారత రాజ్యాంగంలోని ప్రియాంబుల్స్ లో పేర్కొన్న ప్రతి ఒక్కటి ప్రజలకు అందించే విధంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నది అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.