సాయంత్రం 5.30 గంటలకు మంచు మనోజ్ ప్రెస్‌మీట్.. పూర్తి వివరాలు వెల్లడిస్తానని!

-

మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలపై నటుడు మనోజ్ తాజాగా స్పందించారు. బుధవారం ఉదయం ఆయన మాట్లాడుతూ..ఇంట్లో జరుగుతున్న గొడవలకు ఆస్తి తగాదాలు కారణం కాదని.. తన అన్నయ్య మంచు విష్ణు, వినయ్ కలిసి మా నాన్నను ట్రాప్ చేశారని వివరించారు. తన తల్లిని కూడా ఇంట్లో నుంచి మూడురోజుల పాటు బయటకు పంపించి వేశారని, తన తండ్రి ఎదుట తనను విలన్‌ను చేసి చూపించారని ఆరోపించారు.

తన భార్యను, ఏడు నెలల పాపను ఈ గొడవలోకి లాగి వారిపై దుష్ప్రచారం చేస్తున్నారని, తను ఎవరినీ ఆస్తులు అడగలేదని, సొంతంగానే తన కాళ్లమీద నిలబడ్డానని.. తన భార్యతో కలిసి టాయ్స్ కంపెనీ పెట్టానని, ఫ్రెండ్స్ సాయంతో సినిమాలు చేస్తూ లైఫ్ లీడ్ చేస్తుంటే అన్నింటిలోనూ తనను ఇబ్బంది పెడుతున్నారని.. ఆ వివరాలను సాయంత్రం 5.30 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తానని మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. అంతకుముందు తన తండ్రి దాడి చేసిన ఘటనకు సంబంధించి మీడియాకు క్షమాపణలు చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news