రాష్ట్రంలో శీతాకాల ప్రభావం తీవ్రంగా ఉంది. రాత్రిళ్లు చల్లని గాలులు వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రతకు అటు పెద్దవాళ్ల నుంచి విద్యార్థుల వరకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే చలి వాతావరణంతో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా సారంగపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది.
ఉదయం చలి ఎక్కువగా ఉండటంతో పలువురు విద్యార్థినిలు అసౌకర్యానికి గురయ్యారని సమాచారం. కళ్లు తిరుగుండటంతో ముందు జాగ్రత్తగా ఆరుగురు విద్యార్థినిలను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినిలకు ఎలాంటి సమస్య లేదని, కాసేపట్లో పాఠశాలకు వెళ్తారని వైద్యులు తెలిపారు. కాగా, ఇటీవల గురుకుల విద్యార్థునులు పలుమార్లు ఫుడ్ పాయిజన్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందిన విషయం తెలిసిందే.
చలి వాతవరణంతో ఆరుగురు విద్యార్థినులకు అస్వస్థత
జగిత్యాల జిల్లా సారంగపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఉదయం చలి ఎక్కువగా ఉండటంతో.. పలువురు విద్యార్థినిలు అసౌకర్యానికి గురయ్యాయి
కళ్లు తిరుగుండటంతో ముందు జాగ్రత్తగా ఆరుగురు విద్యార్థినిలను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు… pic.twitter.com/fkOFtyqEF7
— Telugu Galaxy (@Telugu_Galaxy) December 11, 2024