తొక్కిసలాట ఘటన.. హైకోర్టుకు అల్లు అర్జున్

-

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా నటించిన మూవీ పుష్ప-2 డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 04న హైదరాబాద్ లోని కొన్ని థియేటర్లలో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ కి చేరుకున్నారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న ఫ్యాన్స్ భారీగా అక్కడికీ చేరుకున్నారు.

దీంతో అక్కడ తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కి చెందిన రేవతి(39) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. కూతురు శాన్వీ కూడా గాయపడినట్టు సమాచారం. అయితే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన పై పుష్ప-2 హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు అయిన కేసును కొట్టేయాలని తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయన పై కేసు నమోదు అయింది. ఇప్పటికే థియేటర్ యజమాని, మేనేజర్ తో పాటు సెక్యూరిటీ మేనేజర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news