చలికాలంలో నారింజ పండ్లు తినడం వల్ల శరీరానికి మంచి ఆరోగ్యం అందుతుంది. నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. చాలామంది నారింజ తొనల్ని తిని తొక్కల్ని పడేస్తారు. ఇకనుంచి అలా పడేయకండి ఎందుకంటే తొక్కల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
ఎస్.. తొక్క వల్ల లాభాలేంటని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. బట్ చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొహానికి మేలు చేసే నారింజ తొక్కలు:
తొక్కల్ని ఉపయోగించి ఫేస్ మాస్క్ తయారు చేసుకోవడం వల్ల చర్మం మిలమిలా మెరవడంతోపాటు తాజాగా ఉంటుంది. చర్మం మీద పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోతాయి. దీనికోసం నారింజ తొక్కల్ని ఎండబెట్టి గ్రైండర్ లో వేసి పొడి చేయాలి. ఆ పొడికి తేనే, పెరుగు కలిపి మొహానికి మాస్క్ వేసుకోవాలి.
గదిలో సువాసన వెదజల్లే తొక్కలు:
నారింజ తొక్కల్ని ఒక పాత్రలో వేసి నీళ్లు పోసి లవంగాలు, దాల్చిన చెక్క నీళ్లలో వేసి కాసేపు మరిగించాలి. ఇలా చేసిన కొన్ని నిమిషాలకి గదంతా సువాసనతో నిండిపోతుంది. చుట్టాలెవరైనా ఇంటికి వస్తున్నారని తెలిసినప్పుడు ఈ విధంగా చేయండి.
మరకలను పోగొట్టే తొక్కలు:
కిచెన్లో స్టవ్ మీద మరకలు పోకుండా అసహ్యంగా కనిపిస్తుంటే నారింజ తొక్కలు మంచి మేలు చేస్తాయి. తొక్కల్ని వెనిగర్ లో రెండు వారాలపాటు నానబెట్టి ఆ తర్వాత వడబోసిన ద్రావణాన్ని బాటిల్ లో ఉంచుకొని.. అవసరం అయినప్పుడల్లా మరకల మీద పోసి తుడిస్తే మరకలన్నీ మాయం అయిపోతాయి.