తిరుమల భక్తులకు అలర్ట్…ఇవాళ దర్శనాలకు 06 గంటల సమయం పడుతోంది. తిరుమల..వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 15 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. టోకెన్ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 06 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 65, 887 మంది భక్తులు దర్శించుకున్నారు.
25, 725 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.88 కోట్లు గా నమోదు ఐంది. ఇక అటు తిరుమలలో 16వ తేదీ నుంచి ధనుర్మాస నెల ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ నుంచి నెల రోజులు పాటు శ్రీవారి ఆలయం లో సుప్రభాత సేవ బదులుగా స్వామివారికి తిరుప్పావైతో మేల్కోలుపు ఉంటుంది. ఇక అటు తిరుమలలో జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది.
- తిరుమల..15 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 06 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65887 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 25725 మంది భక్తులు
- హుండి ఆదాయం 3.88 కోట్లు