అవంతి శ్రీనివాస్ కి టచ్ లో టిడిపి నాయకులు!

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో దారుణ ఓటమితో వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. సీనియర్ నాయకులు ఒక్కొక్కరు ఆ పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు. తాజాగా వైఎస్ఆర్సిపి ముఖ్య నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వైసిపి పార్టీ సభ్యత్వానికి, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి గురువారం అవంతి రాజీనామా చేశారు.

గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్న ఆయన.. ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి, ప్రస్తుతం టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే తన అనుచరులతో చర్చించినట్లు సమాచారం. అయితే వ్యక్తిగత కారణాలతోనే అవంతి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ కి టిడిపి నాయకులు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

రాజీనామా ప్రకటన వెంటనే ఉత్తరాంధ్ర కీలక నేతలు అవంతి శ్రీనివాస్ కి ఫోన్లు చేసినట్లుగా సమాచారం. అయితే తనకి ఎక్కడ గౌరవం లభిస్తే అక్కడే ఉంటానని అవంతి చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే అవంతి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపి కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news