చాలామంది ఆహారం తీసుకునే విషయంలో తప్పులు చేస్తూ ఉంటారు ఇలాంటి తప్పులు చేయడం వలన ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మధ్యాహ్న భోజనం సమయంలో ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి. ఈ తప్పులను చేయడం వలన మీరే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మధ్యాహ్నం భోజనం సమయంలో ఇలాంటి తప్పులను చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పులను ఎవరు చేయకూడదు.
భోజనాన్ని స్కిప్ చేయకండి:
చాలామంది మధ్యాహ్నం పూట భోజనానికి స్కిప్ చేస్తూ ఉంటారు ఉద్యోగాల వలన కానీ ప్రయాణాల వలన కానీ మరే కారణాల వలన కూడా స్కిప్ చెయ్యద్దు.
పనిచేస్తూ తినడం:
చాలామంది వర్క్ చేస్తూ తినేస్తూ ఉంటారు ఇలా చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా మీరు పని చేసే కంప్యూటర్ డస్క్ దగ్గర టాయిలెట్ సీట్ కంటే మూడు రెట్లు క్రిములు ఎక్కువ ఉంటాయి.
ఫోన్ చూస్తూ తినడం:
ఫోన్ స్క్రోల్ చేస్తూ చాలామంది తింటూ ఉంటారు ఇలా చేయడం కూడా అసలు మంచిది కాదు. సరిగా తినడానికి ఎవ్వడు. పైగా ఫోన్ లకి ఉండే క్రిములు కారణంగా మీ ఆరోగ్యం పాడవుతుంది.
ఆలస్యంగా తినడం:
టైంకి తినకుండా చాలా ఆలస్యంగా తినడం కూడా మంచిది కాదు.
ఇలాంటి ఆహారం తీసుకోవడం:
బాగా కారంగా ఉండే ఆహారం.. ఆహారం తినేటప్పుడు పైన మసాలా వేసుకోవడం వంటివి చేస్తారు అలాంటివి చేయొద్దు.
సోడా వంటివి తాగడం:
సోడా వంటివి ఆహారం తీసుకునేటప్పుడు తీసుకోవద్దు.
ప్లాస్టిక్ వాటిని ఓవెన్ లో పెట్టడం:
చాలామంది ప్లాస్టిక్ కప్పులని ఓవెన్ లో పెట్టి ఆహారం తీసుకుంటారు అలాంటి తప్పును చేయొద్దు.
తిన్నాక ఎక్కువసేపు కూర్చోడం:
ఆహారం తిన్నాక ఎక్కువసేపు కూర్చోవడం కూడా మంచిది కాదు. ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
ఆరోగ్యానికి మంచిదని అతిగా తినడం:
ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకుంటే కూడా ఇబ్బందులు ఎదుర్కోవాలి.
ఎక్కువ సాల్ట్ వేసుకోవడం:
ఎక్కువ సాల్ట్ వేసుకుని ఆహారం తీసుకోవడం కూడా మంచిది కాదు ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
ఆకుకూరలుని కూరగాయలుని తీసుకోకపోవడం:
ఆకుకూరని కూరగాయలను చాలామంది తీసుకోవడానికి ఇష్టపడరు ఆ తప్పు మాత్రం అస్సలు చేయకండి.
ప్రాసెస్ చేసిన మాంసం తీసుకోవడం:
ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.