ఏపీలో వరుసగా గంజాయి, మాదక ద్రవ్యాలు పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. ముఖ్యంగా విశాఖ మన్యంలో ఈ గంజాయి సాగు చేస్తున్నట్లు ఇప్పటికే పలుమార్లు పోలీసులు గుర్తించి మీడియాకు సైతం వివరించారు. తాజాగా మన్యం జిల్లాలోని పార్వతీపురం మాతుమూరు గ్రీన్ ఫీల్డ్ హైవేలో పోలీసులు ఒరిస్సా నుండి వస్తున్న మారుతి సుజుకీ బ్రెజ్జా కారును తనిఖీ చేయగా 318 కేజీల గంజాయి పట్టుబడింది.
ఒరిస్సా నుంచి వయా వైజాగ్ మీదగా తెలంగాణకు అక్కడి నుండి రాజస్థాన్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 15 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఒక కారు ఇద్దరు నిందితులను అదుపులో తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.