రేవతి కుమారుడు శ్రీ తేజ దగ్గరకు వెళతా..ఆదుకుంటా – అల్లు అర్జున్‌

-

రేవతి కుమారుడు శ్రీ తేజ దగ్గరకు వెళతా..ఆదుకుంటా అంటూ సంచలన ప్రకటన చేశారు హీరో అల్లు అర్జున్‌. ఉదయం మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్… మరోసారి మీడియా ముందుకు వచ్చారు. బాధిత కుటుంబానికి క్షమాపణలు చెప్పారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్లో ప్రదర్శించిన పుష్ప 2 బెనిఫిట్ షోకు తాను హాజరైన సమయంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన మహిళ కుటుంబానికి క్షమాపణలు చెప్పారు అల్లు అర్జున్.

allu arjun

బాధిత కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటానని మరోసారి పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్, మీడియాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటన పట్ల చింతిస్తున్నాను, చికిత్స పొందుతున్న రేవతి కుమారుడిని నేను వెళ్లి పరామర్శిస్తాను,మీడియాకు నా ధన్యవాదాలు అంటూ ప్రకటన చేశారు. సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన ఘటన మా కంట్రోల్‌లో లేదని తెలిపారు అల్లు అర్జున్‌. 20 ఏళ్లుగా నేను సంధ్య థియేటర్ లో సినిమా చూస్తున్నానన్నారు. అది అనుకోకుండా జరిగింది.. రేవతి కుమారుడు శ్రీ తేజని పరామర్శిస్తానని వెల్లడించారు అల్లు అర్జున్.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news