అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. హీరో అల్లు అర్జున్ మా బంధువంటూ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం బాధాకరమన్నారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. బెయిల్ దొరకడం సంతోషకరమని వెల్లడించారు. అల్లు అర్జున్ జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ల పేర్లును తీసుకెళ్లి మంచిపేరు తెచ్చారని ఆగ్రహించారు.
అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోనే కాదు ప్యాన్ వరల్డ్ హీరో అని గుర్తు చేశారు ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. అరెస్ట్ కావడం దురదృష్టకరమైన సంఘటనగా నేను భావిస్తున్న ట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించిందని ప్రతిపక్షాలు అనడం భావ్యం కాదన్నారు ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ సంఘటన జరుగడం దారుణమన్నారు.