ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయం.
వైసీపీ అధినేత పుట్టిన రోజు కార్యక్రమంలో అందరూ మమేకం కావాలని కోరింది. ఎమ్మెల్యేలు, పార్టీ కో–ఆర్డినేటర్లు సమన్వయం చేసుకుని.. పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులను భాగస్వామ్యం చేస్తూ, జగన్ గారి పుట్టినరోజు వేడుకలు అన్ని స్థాయిల్లో ఘనంగా నిర్వహించాలని నిర్దేశించింది. వైఎస్ జగన్ ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పుట్టిన రోజు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్టు తెలుస్తోంది. జగన్ పుట్టిన రోజున రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని జగన్ మోహన్ రెడ్డికిి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయనున్నట్టు సమాచారం.