నా కూతురుని హత్య చేసారంటూ సీఎం వద్దకు వచ్చిన బాధితులు..!

-

విడదల రజనీ, లేళ్ల అప్పిరెడ్డి దగ్గర పనిచేసే మనుషులు నా కూతురుని హత్య చేశారు సీఎం వద్దకు వచ్చారు బాధితులు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళితే మాపైనే అక్రమ కేసులు బనాయించారు అని తెలిపారు. అయితే పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుకు వివిధ ప్రాంతాల ప్రజల విన్నపాలు స్వీకరించారు.

అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న తన కూతురు 2022 జూలై 4న కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని.. అదే కాలనీలో ఉంటున్న ఆటో డ్రైవర్ ఆనంద్ అనే యువకుడు ప్రేమపేరుతో వంచించాడని సీఎం వద్ద మొరపెట్టుకుంది గుంటూరు జిల్లా, గుజ్జనగుళ్లకు చెందిన నిశంకర శంకరలీల అనే మహిళ. 14 నెలల పాటు తన కూతురుని చిత్రహింసలు పెట్టి బండారు ఆనంద్, అతని సోదరులు అరవింద్, అజిత్ వారి మేనమామ తిరుపతిరావు, అత్త అంకలక్ష్మీ తన కూతురుని శవంగా పంపించారని కన్నీటి పర్యంతమైంది బాధితురాలు ఇక ఈ ఈ కేసులో ఎంతటివాళ్లున్నా వదిలిపెట్టమని, తప్పకుండా న్యాయం చేస్తామని సీఎం భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news