2024 సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సంవత్సరంలోనే తెలుగు నుండి రెండు సినిమాలు 1000 కోట్ల కలెక్షన్ల మార్కును చేరుకున్నాయి. అయితే ఈ సంవత్సరంలో కొంతమంది స్టార్ హీరోలు థియేటర్లలో కనిపించలేదు. అంటే వారి నుండి ఈ ఏడాది ఒక్క రిలీజ్ కూడా లేదు. ఆ హీరోలు ఎవరో చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం థియేటర్లలో కనిపించలేదు. ఆయన హీరోగా నటిస్తున్న విశ్వంభర చిత్రం 2025 వేసవిలో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి చివరిగా.. మెహెర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో కనిపించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన నిరాశను మిగిల్చింది.
అదలా ఉంచితే రీసెంట్ గా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రకటన వచ్చింది.
రామ్ చరణ్ తేజ:
రామ్ చరణ్ థియేటర్లలో కనిపించి ఇప్పటికి రెండేళ్లకు పైగానే అయ్యింది. 2022 మార్చ్ లో ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన మన ముందుకు వచ్చారు. 2024లో నుండి ఒక్క సినిమా రిలీజ్ కాలేదు. కాకపోతే 2025 మొదట్లోనే గేమ్ చేంజర్ సినిమాతో పలకరించనున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్ సినిమా.. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10వ తేదీన రిలీజ్ కానుంది.
కియారా అద్వానీ హీరోయిన్గా కనిపిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.