తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమలలో ఇవాళ కార్తీక దీపోత్సవం జరుగనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలోనే కార్తీక దీపోత్సవం ఉంటుంది. ఇవాళ సాయంత్రం స్వామివారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు ఇచ్చిన తర్వాత దీపోత్సవం ప్రారంభం కానుంది. మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేసి శ్రీవారికి హారతి సమర్పణ ఉంటుంది.
అనంతరం ప్రధాన ఆలయంతో పాటు ఉప దేవాలయాల్లో దీపాలు ఏర్పాటు చేస్తారు. ఇక ఇవాళ కార్తీక దీపోత్సవం కారణంగా సహస్రదీపాలంకరణ సేవ, గరుడ సేవను రద్దు చేసింది టీటీడీ పాలక మండలి బృందం. ఈ మేరకు తిరుమల శ్రీవారి భక్తులను అలర్ట్ చేసింది టీటీడీ పాలక మండలి బృందం.
- తిరుమల..22 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72962 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 30645 మంది భక్తులు
- హుండీ ఆదాయం 3.37 కోట్లు