ఎన్టీఆర్ ఘాట్ లేపేసి కొత్త అసెంబ్లీ భవనం కడితే బాగుంటుంది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ భవనం చాలా ఓల్డ్ ది అని.. సచివాలయం కొత్తది అని తెలిపారు. సచివాలయం, అసెంబ్లీ పక్క పక్కన ఉంటే పరిపాలనకు చాలా సులభంగా ఉంటుందని తెలిపారు.
అందుకే సచివాలయం పక్కన ఉన్నటువంటి ఎన్టీఆర్ ఘాట్, గార్డెన్ ను తొలగించి అక్కడ అసెంబ్లీ భవనం నిర్మిస్తే.. పాలనకు బాగుంటుందని వెల్లడించారు రాజగోపాల్ రెడ్డి. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయనే చెప్పాలి. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరీ.