రాష్ట్రంలో హోంగార్డులకు కానిస్టేబుల్ ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రాథమిక రాత పరీక్షల్లో కనీస మార్పులు రావాల్సిందేనని రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు (ఎస్ఎల్‌పీఆర్‌బీ) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పోలీసు కానిస్టేబుల్ ఎంపిక కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించలేదంటూ తమను అనర్హులుగా ప్రకటించారని పలువురు హోంగార్డులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి నవంబర్ 12న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను దేహదారుఢ్య, తుది రాత పరీక్షలకు అనుమతించాలని ఎస్ఎల్‌పీఆర్‌బీని ఆదేశించారు. తాజాగా హోంగార్డులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించిందనే చెప్పాలి. కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో హోమ్ గార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కు ఆదేశం జారీ చేసింది. ఆరు వారల్లో ప్రత్యేక మెరిట్ జాబితా తయారీ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టీకరణ చేసింది.