బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపైకి చెప్పుచూపించారట కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరయ్య. అసెంబ్లీలో షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనుచిత, అసభ్య ప్రవర్తన వివాదంగా మారింది. అసెంబ్లీలో ఎమ్మెల్యే శంకర్ తీరుపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పు చూపించారంటూ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. అసెంబ్లీ ఫుటేజ్ బయటపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్…నిరసనకు దిగింది. ఇక అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ ప్రసాద్ పైకి పేపర్లు విసిరారు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఫార్ములా ఈ-కార్ రేస్‌పై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించడంతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనుచిత, అసభ్య ప్రవర్తన
అసెంబ్లీలో ఎమ్మెల్యే శంకర్ తీరుపై బీఆర్ఎస్ మండిపాటు
షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పు చూపించారంటూ బీఆర్ఎస్ ఆరోపణ
అసెంబ్లీ ఫుటేజ్ బయటపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్
ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ కేసు… pic.twitter.com/G8q0wuJfJo
— Telugu Scribe (@TeluguScribe) December 20, 2024