ఫార్ములా – ఈ కేసులో కేటీఆర్ కు షాక్ తగిలింది. ఫార్ములా – ఈ కేసులో రంగంలోకి ఈడీ అధికారులు దిగారు. ఫార్ములా – ఈ కేసుపై తెలంగాణ ఏసీబీకి లేఖ రాసింది ఈడీ. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు, ఎఫ్‌ఐఆర్ కాపీతోపాటు HMDA అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో మరియు ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలు కోరింది ఈడీ.
దాన కిశోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపాలన్న ఈడీ…ఈ మేరకు ఫార్ములా – ఈ కేసుపై తెలంగాణ ఏసీబీకి లేఖ రాసింది. ఇక ఇదే అంశంపై కేటీఆర్ స్పందించారు. నన్ను ఏ కేసులో అరెస్ట్ చేయాలో ప్రభుత్వానికి అర్థం కావడం లేదని చురకలు అంటంచారు. ఫార్ములా-ఈ కేసులో మేము కూడా లీగల్‌గా ముందుకు వెళ్తామని… నిన్నటి మీడియా సమావేశంలో అవినీతి జరగలేదని పొన్నం ప్రభాకర్ చెప్పాడన్నారు. ప్రోజీసర్ కరెర్ట్‌గా లేదు అని అన్నారు.. అంతేకాని అవినీతి ఉందని అన్నారా ? అంటూ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారా లేక రేవంత్ రెడ్డే అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదని చురకలు అంటించారు. నేను చెప్పాల్సిన విషయాలు అన్ని చెప్పడం జరిగిందని వివరించారు.